త్యాగమూర్తి అమ్మ:- --గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు,9966414580.
నవ మాసాలు మోసేది
కనుపాపలా కాచేది
అనురాగ దేవత అమ్మ
కుటుంబాన పట్టుకొమ్మ

సేవలెన్నో చేసేది
త్యాగమెంతో చూపేది
ఇంటిలోన మాతృమూర్తి
జగతిలోన గొప్ప స్ఫూర్తి

ప్రేమనెంతో చాటేది
కుటుంబాన్ని దిద్దేది
తప్పులన్నీ మన్నించి
కడుపులో దాచుకునేది

అవనిలోన  అమ్మ  మేటి
లేరు లేరు ఎవరు సాటి
అబల కాదు ఆమె సబల
గృహమున ఉంటే  కళకళ


కామెంట్‌లు