చిత్ర విచిత్రాలు!:- --గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు,9966414580.
మనసుకు వేగమెక్కువ
నోటికి దూకుడెక్కువ
వాటిని నియంత్రిస్తే
వారే విశ్వ విజేతలు!

మనిషికి ఆశ ఎక్కువ
కంటికి తృప్తి తక్కువ
అవి సమతుల్యమైతే!
రెట్టింపు ఆనందమే! 

ఈర్ష్యకు  చెరుపు ఎక్కువ
మనసుకు స్థిరత తక్కువ
రెండింటిపై గెలిస్తే
పరాక్రమశాలురు మనమే!

వ్యక్తిత్వం అవసరమే!
సంస్కారం ముఖ్యమే!
అవి లోపిస్తే మాత్రము
తప్పదోయ్! అగౌరవము


కామెంట్‌లు