నిర్ణయం నీదే!!:- --గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు,9966414580.
మనుషులను నమ్మితే
నట్టేట ముంచుతారు
కనులతో కవ్విస్తారు
వెనుక గోతులు తీస్తారు

భగవంతుని నమ్మితే
బ్రతుకంతా క్షేమమే!
అడుగడుగునా గొడుగై
నిలబడును అన్నీ తానై

ఎన్నడు ఆధారపడకు
ఈ మానవ మాత్రులపై
వాడుకుని వదిలేస్తారు
ద్రోహమే తలపెడుతారు

నీకు నీవు తెలుసుకో!
మేలైనది కోరుకో!
దేవుడా! మానవుడా!!
వివేచనతో ఎన్నుకో


కామెంట్‌లు