పల్లెకు పోదాం:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
పల్లెసీమ అందాలు
పచ్చని తోరణాలు
చేయునోయ్! కనువిందు
కాయాలోయ్!మున్ముందు

అంతటా పచ్చదనము
అత్యంత ఆహ్లాదము
తల్లి వంటి పల్లెటూరు
అందరి క్షేమము కోరు

పక్షుల కోలాహలము
సెలయేరుల ప్రవాహము
నింపునోయ్! ఆనందము
అనుభూతి అద్వితీయము

పల్లెతల్లిని చూద్దాం!
ప్రణమిల్లి మ్రొక్కుదాం!
జగతి ప్రగతి పట్టుకొమ్మ
ఆసక్తి చూపిద్దాం!


కామెంట్‌లు