దురాలవాట్లు కీడు:- -గద్వాల సోమన్న,-9966414580
పనికిరాని అలవాట్లు
ముసిరిన పెను చీకట్లు
అధికమైతే మాత్రము
తెచ్చిపెట్టు ఇక్కట్లు

బానిసలుగా మారితే!
జీవితం అధోగతే!
మార్చుకుంటే అలవాట్లు
బ్రతుకున గొల్పు మిరుమిట్లు

ఆదిలోనే త్రుంచితే!
ఎంతైనా మంచిదే!
దురాలవాట్లు నిప్పులు
తగలబెట్టు జీవితాలు

అలవాట్లు మంచివైతే
దక్కుతుంది గౌరవము
లేకుంటే జీవితము
అగును అతలాకుతలము


కామెంట్‌లు