వాస్తవాల వీచికలు:- -గద్వాల సోమన్న,-9966414580
స్థిరము లేని మనసులు
అదుపు లేని బ్రతుకులు
అభివృద్ధికి దూరము
పుడమికి కడు భారము

గుండెలోని కలతలు
శృతిమించిన కక్షలు
మనశ్శాంతి తరుమును
బంధాలను చెరుపును

హద్దు లేని ఆశలు
గగనమంత వాంఛలు
తెచ్చిపెట్టు ఇడుములు
చేయు బ్రతుకు ముక్కలు

కఠినమైన పలుకులు
గుండెకవే మేకులు
హృదయాలను నలపును
గాయాలే రేపును

బాధ్యత గల వ్యక్తులు
దేశానికి శక్తులు
అట్టి వారు నిజముగా
గౌరవానికర్హులు

సరిహద్దు సైనికులు
పారిశుద్ధ్య కార్మికులు
నా దృష్టిలో ఘనులు
చదువు చెప్పు గురువులు


కామెంట్‌లు