నాన్న అన్నింటి కన్న మిన్న:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
కుటుంబాన అధిపతి
ఖరీదైన బహుమతి
కనిపించే దేవుడు
కన్న తండ్రి భానుడు

బాధ్యత గల యోధుడు
నాన్న త్యాగమయుడు
అహర్నిశలు శ్రమించే
కుటుంబ పోషకుడు

సదా పూజనీయుడు
నాన్న ప్రేమామయుడు
తన బిడ్డల కోసము
పాటు పడును సతతము

పిల్లలు జీవితాన
అభివృద్ధి చెందితే
నాన్నెంతో పొంగును
మీసాలు మెలేయును

నాన్న ఇంటికి అండ
బలీయమైన కొండ
సదన వనంలోన
పరిమళాల పూదండ

నాన్న కంటే మిన్న
జగతిలో లేదన్న
వారితో అభివృద్ధి
ఇంటిలోన సమృద్ధి


కామెంట్‌లు