మానాలి! కక్షలు:- -గద్వాల సోమన్న,-9966414580
పెంచుకోకు కక్షలు
పాడు చేయు బ్రతుకులు
ఎక్కువైతే గనుక
త్రుంచునోయ్ బంధాలు

కక్షలున్న మనసులు
పగబట్టిన పాములు
తీయునోయి!  అసువులు
కఠినమోయి! మనుషులు

మనశ్శాంతి ఉండదు
సమైక్యత కుదరదు
కక్షలతో  సమస్యలు
ఉండును కోకొల్లలు

మానాలోయి! కక్షలు
మానవత్వముండాలి
మనుజులుగా బ్రతకాలి
దైవత్వం పండాలి

క్షమాగుణం గొప్పది
ఉంటేనే మంచిది
శత్రుత్వం తగ్గును
చెలిమి కలిమి హెచ్చును


కామెంట్‌లు