అక్షరమే అక్షయపాత్ర:- -గద్వాల సోమన్న,-9966414580
అక్షరం సొంతమైతే
విజ్ఞానం పెరుగుతుంది
భవిష్యత్తు జీవితమే
బంగారుమయవుతుంది

అక్షరమే శక్తిగలది
జీవితాలు నిలుపుతుంది
శోధింపగ  ఘనమైనది
ఆనందం పంచుతుంది

అక్షరాల్ని నమ్మితే
వమ్ము కావు నమ్మకాలు
మారుతాయి జాతకాలు
వెలుగుతాయి మస్తకాలు

అక్షరాలు ఆయుధాలు
కాంతులీను కాగడాలు
నింపుకుంటే బ్రతుకులో
బాగుపడును కుటుంబాలు

అక్షయ పాత్ర అక్షరము
వద్దు వద్దు నిర్లక్ష్యము
నేర్చుకుంటే మాత్రము
హైయిగుండు జీవితము


కామెంట్‌లు