ఉంటేనే మేలు!మేలు!!:- --గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు,9966414580.
బద్దకముకా ఉంటే
గమ్యాన్ని చేరలేవు
చురుకుదనం వీడితే
లక్ష్యము చేధించలేవు

ఓర్వలేనితనముంటే
మనశ్శాంతికి దూరము
ప్రతీకార గుణముంటే
చెడును పవిత్ర బంధము

సామరస్యముంటేనే
సమసిపోవు సమస్యలు
సంతోషముంటేనే
వెలిగిపోవును ముఖములు

ఏకాగ్రత ఉంటేనే
ఏదైనా సాధ్యమగును
సాహసము చేస్తేనే
విజయాలు దరి చేరును 


కామెంట్‌లు