అవసరం!!:- -గద్వాల సోమన్న,-9966414580
కావాలి బంధుత్వము
పోవాలి అంధత్వము
మనశ్శాంతి కోసమే
మానాలి శత్రుత్వము

మాటల్లో మృదుత్వము
చేతల్లో దాత్రుత్వము
ఉంటేనే గౌరవము
ఘనమైన వ్యక్తిత్వము

మనసులో కఠినత్వము,
తొలగితే మూర్ఖత్వము
ఎంతైనా క్షేమకరము
కాదనుట ఎవరితరము!

జీవితాన వీరత్వము
సమైక్యతకు ఏకత్వము
అవసరమే సమాజాన
శ్రేష్టమైన ప్రేమతత్వము


కామెంట్‌లు