ధ్యానము ముఖ్యము:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
ప్రతిరోజూ ధ్యానము
చేస్తే ఆరోగ్యము
ఒత్తిడి తొలగిపోయి
మనసుకెంతో హాయి

ధ్యానమే ఔషధము
మనశ్శాంతికి మార్గము
ఖర్చు అసలు లేనిది
మదికెంతో బలమది

అనారోగ్యము దూరము
చేసేటి సాధనము
ఆధునిక కాలంలో
అందరికిఅవసరము

చేయాలోయ్! ధ్యానము
పోవాలోయ్! రోగము
ఉండాలోయ్! శాంతము
గుండె నిండా అనిశము


కామెంట్‌లు