బెజవాడ
'చిన్ని' తాత....
అరుదుగాకనిపించే
ఆత్మీయ బంధువు!
అసలు పేరు జాషువా ,
'చిన్ని ' ముద్దుపేరు
అందుకేనేమో ....
నికోకి చిన్నితాత !
కొత్తనేది లేకుండా ...
పిలవగానే పరుగెత్తికెళ్లి
చిన్నతాత చంక చేరతాడు
అందరినీ ---
ఆశ్చర్యపరుస్తాడు !
నికో తల్లికి
చిన్నమేనమామ జాషువ ,
ఆబంధమే ..నికో ని
అలా దరిచేరుస్తుందేమో !
ఆత్మీయతను పెంచుతుందేమో !!
బంధం ...!!---డా.కె.ఎల్.వి.ప్రసాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి