మనమధ్యే ఎంతోమంది నడయాడిన మహనీయులు పరమభక్తుల గూర్చిన సమాచారం మనకు తెలీదు.కారణం? సినిమాలు నేరాలపై ఆకర్షణ ఆసక్తి! కానీ ఆనాటి కవులు పండితుల సాహిత్యం ప్రభువుల ప్రజల మన్ననలందాయి.నీతిన్యాయంపై పెద్దలు కథలుగా చెప్పేవారు.నేడు మనం ప్రాణమున్న రోబోలం.పైగా చెత్త సాహిత్యం అలాంటి అశ్లీల చిత్రాలతో వీక్లీలు మంత్లీలు ప్రచురింపబడుతున్నాయి.
ధూర్జటి మహాకవి కాళహస్తీశ్వరశతకంలో తన తప్పుల్ని నిర్భయంగా శివుని ముందు వెళ్లగక్కి ఆదర్శ కవిగా నేటికీ నిలిచాడు.అలా శివభక్తులుగా సదా పరమేశ్వర కథలు నామంతో స్మరించిన మహానుభావులు శ్రీ నిర్మలశంకరశాస్త్రి ఆరాధ్యులవారు.ఆయన సదా శివ స్మరణతో గడిపారు.ఒకసారి ఆయన తన ఇంట్లో అద్దెకున్నవ్యక్తి చాలా నెలలుగా అద్దె ఇవ్వక పోతే స్వయంగా అడగటానికి వెళ్లారు.మరి ఆయన ధర్మం.ఆఅద్దెకున్న వాడు అహంకారం కోపంతో శాస్త్రిగారిని కొట్టినంత పనిచేశాడు.ఆయన చాలాబాధపడుతూ ఆరాత్రంతా శివ నామస్మరణ తో గడిపారు.తెల్లార్తూనే అద్దెకున్నవాడు పూలదండతో పరుగున వచ్చి ఆయన కాళ్లపై బడి కన్నీటితో పాదాభిషేకంచేశాడు.ఆయన ఒక్క మాట అనకుండా ఆప్యాయంగా గుండెకు హత్తుకున్నారు.ఇంకోమహానుభావుడు మల్లంపల్లి శరభేశ్వరశర్మగారు.శివనామంతప్ప ఆయన నోటివెంట ఇంకోమాట వచ్చేదికాదు.గంటల కొద్దీ ధూర్జటి శివ భక్తి గూర్చి మాట్లాడేవారు ఆయన పక్షవాతంతో కదలలేని స్థితిలో కూడా! కష్టసుఖాల్లో దైవ స్మరణ మరవరాదు. అదే రమణ మహర్షి కూడా బోధించారు.తన శరీరాన్ని "ఇది_ అది" అని సంబోధన చేసేవారు🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి