నాయనార్లు శివభక్తుల కథలు నేడు మనకు చాదస్తంగా అమానుషంగా తోస్తాయి.కానీ ఆనాటివారు పూర్తిగా దైవంలో లగ్నమైన నిర్మల భక్తులు.అలా నిజంగా జరిగాయా లేదా అనే తర్కం అనవసరం.ఇప్పటికే గాంధీ అంటే తెలీనివారు ఉన్నారంటే నమ్మం. స్వాతంత్య్ర పోరాటం ముందుతరాలకి కట్టుకథలా అనిపించవచ్చు.సినీనటులకున్నంత ప్రాధాన్యత వారికివ్వటంలేదు.పెద్దలు చెప్పటంలేదు.అలా ఆనాటి భక్తుల చరిత్ర మనం నమ్మం. ముష్ణా అనే వితంతువు శివభక్తురాలు. ఇతరుల ఇళ్లల్లో చాకిరీచేసి కొడుకును పోషిస్తూ బాటసారులకు అన్నంపెట్టేది. ఈమె భక్తిని పరీక్షించాలని శివుడు వస్తే "మడితో వంట చేస్తా" అని చెరువులో స్నానంచేసిరమ్మని పంపింది.శివుడు ఆమె కొడుకుదగ్గరకు మేనమామ రూపంలో వెళ్లాడు.పొలంలో పనిచేస్తున్న ఆకుర్రాడు" మామా! ఎప్పుడొచ్చావు?" అని అడిగితే" మీఅమ్మ నిన్ను అన్నంతింటానికి రమ్మంది. నేనుతిన్నాను" అన్నాడు శివుడు.ఆకలితో ఉన్న ఆపిల్లాడు ఇంటికెళ్లేప్పటికి తల్లి పొరుగింటిలో పనికిపోయింది.ఆకుర్రాడు భోజనం ముగించగానే ముష్ణా వచ్చి" అతిథులకి వండింది ఎందుకు తిన్నావని" రోకలిబండతో నెత్తిపై కొట్టగానే వాడు ప్రాణాలు వదలడం వాడి శవాన్ని అటకపై పడేసి మళ్లీ వంటచేసింది. ఈలోపల బాటసారివేషంలో శివుడొచ్చి "నీకొడుకుని పిలు" అన్నాడు.ఆమె కోపంతో రోకలిఎత్తి " ముందు భోజనంచెయ్యి" అని బెదిరించటంతో కిక్కురుమనకుండా తిన్నాడు శివుడు.ఆపై ఆమె కొడుకును చంపానని వలవల ఏడిస్తే ఆపిల్లాడి పేరుతో శివుడు పిలవగానే వాడు అటకదూకి వచ్చాడు.ధనుషా ముసలేన అంటే రోకలిబండ తో కొట్టడం అని అర్ధం.మనం పూజచేసే 5నిముషాలు నిశ్చింత గా ధ్యానంలో ఉండాలి.అదే భక్తి🌹
శివభక్తురాలు దర్భముష్ణ! ...అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి