కవనబాల:-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మదిలో
పుట్టాను
మహిలో
పడ్డాను

కలమునుండి
జారాను
కాగితముపైన
కూర్చున్నాను

అక్షరాలను
అయ్యాను
అర్ధాలను
అందించాను

పదాలరూపం
పొందాను
ప్రాసలుగా
మారాను

పంక్తులుగా
పేర్చబడ్డాను
పూర్తిబొమ్మగా
తయారయ్యాను

పుట్టినబిడ్డను
అయ్యాను
పాఠకులచేతుల్లోకి
వెళ్ళాను

మనసులు
తట్టాను
మోదము
కలిగించాను

పురిటిపిల్లను
సాకండి
అల్లారుముద్దుగా
పెంచండి

కవనబాలను
దీవించండి
కవిగారిని
గుర్తించండి


కామెంట్‌లు