తస్మాత్... జాగృత...! :- కోరాడ నరసింహా రావు
ఆడపిల్ల ఈడ కొన్నాల్లే ఉన్నా... ఆడపిల్ల, ఆడ  పిల్లే ఐనా..., 
   యే ఇంట నున్నా... 
 ఆడ పిల్లే...యింటికి దీపం
  ఇంట్లో అందరికీ ఆనందపు వెలుగు...! 
     కేవలం ఆడపిల్ల అమ్మ కు సాయమే కాదు, 
ఆమె చదువుల సరస్వతి , సిరి, సంపదాల శ్రీ మహా లక్ష్మి, 
  ఆమె సాధనలో సాక్షాత్ 
  పార్వతీ మాత..... ఆగ్రహిస్తే ... ఆదిశక్తి , అపర కాళికయె...! 
      అందుకే.... ఆడపిల్లను బాల్యం లో... 
ఆపురూపంగాఅల్లారు ముద్దుగా పెంచాలి..., 
  యవ్వనం లో తనతో స్నేహితుల్లా మెస లాలి.... 
   ఆడపిల్లను అలుసుగా చూసి నా, 
అవహేలాన చేసినా...ఆట బొమ్మగా తలచినా..

.మన వినాశాని కి మనమే కారకులం. ..! 
 తస్మాత్... జాగృత...!!
కామెంట్‌లు