ఎదురుచూపు ..!!--డా.కె.ఎల్.వి.ప్రసాద్.


 ప్రసవసమయం
ఆసన్నమయింది...
అందరిలో ఉత్సాహం 
పొంగిపొరలుతున్న 
శుభసమయం....!
అంతలోనే .....
ఒక ప్రశ్నార్ధకం
ఆడపిల్లా ?మగపిల్లవాడా?
అంతలోనే ...అందరికీ
ఆరాటం ....ఆన్షీ
తమ్ముడికి అక్క అవుందా ?
చెల్లెలికి అక్క అవుతుందా ?
'ఎవరైనా ఒకటే!' అన్నది
మూకుమ్మడి-
బయటిమాటైనా....
అంతర్గతంగా అందరికీ
మగపిల్లవాడి కోసం
ఎదురుచూపు....!
అదే నిజమయింది...
ఆన్షీ....
తమ్ముడికే 'అక్క'అయింది!!
                 ***

కామెంట్‌లు