స్వర్ణాంధ్ర 2047 విజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతికి గొప్ప దిక్సూచి కాగలదని శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు డా కుప్పిలి కీర్తి పట్నాయక్ అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈ సంస్థ సేవలను గుర్తించిన ప్రభుత్వం విజయవాడ లో జరిగిన రాష్ట్ర స్థాయి స్వర్ణాంధ్ర సదస్సుకు ఆహ్వానిస్తూ కీర్తి పట్నాయక్ కు పిలుపు వచ్చింది.
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో హాజరైన విజయవాడ బృందం సభ్యురాలిగా కీర్తి పట్నాయక్ హాజరైరి.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈ సదస్సుకు హాజరైన ఆమె మాట్లాడుతూ పదిహేడు లక్షలమంది మేథాసంపత్తితో కూడిన ఆలోచనలు ఈ విజన్ రూపకల్పనకు దోహదపడ్డాయని, తెలుగుజాతి ఈ విశ్వానికే ఆదర్శం కావాలన్న దృడమైన సంకల్పం ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన పరిచారని ఆమె అన్నారు. అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం ఈ విజన్ 2047 లక్ష్యమని, పేదరికం నిర్మూలనే ప్రధాన ఉద్దేశ్యమని, ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఉపాధి కల్పించేందుకు కృషి చేసే అవకాశం ఈ విజన్ వ్యూహరచన అని కీర్తి అన్నారు. వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానం గావించి, నీటి భద్రత పెంచి, కరవురహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేలా ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ ఆశయమని ఆమె అన్నారు. కీర్తి సేవలను కొనియాడుతూ పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి