రమణుని జననం....లోక హితం ! :- కోరాడ నరసింహా రావు!
  కో హం... కో హం...! 
నేర్వవలసినవిద్య,తెలుసుకో వలసిన జ్ఞానము ఇదే!!

నిన్ను నీవు తెలుసుకోగలి గితే...,
  ఇంక నీవు తెలుసుకో వలసిన దేమున్నదీ ప్రపంచమున!? 

ఇదే...రమణుని ఉపదేశము...! 
  నేను నేను అనుకుంటు న్ననేను, నేను కానని...ఈ నే నే  నేను కానపుడు,ఇంక ఈ ప్రపంచములో నాది అనే దేమున్నదీ లోకములో?! 
  ఇది వ్యామోహ బంధ నాలలో చిక్కు కొన నీయని వేదాంత జ్ఞానం ! 

ఇంత గొప్ప ఆత్మబోధను బోధించిన బోధకుడు భాగవాన్ శ్రీ రమణమహర్షి

కావ్య కంఠగణపతిమునిని ప్రభాావితం చేసిన దివ్యఓజస్సు...,చలంవంటినాస్తిక స్త్రీవాదిని,మా ర్చిన భవ్యతేజస్సు శ్రీ రమ ణ మహర్షి...! 
   మానవజీవన సుఖ, సౌ ఖ్యానందములకు,స్వచ్ఛ మైన శా0తికి ఆధ్యాత్మిక జ్ఞానమును మించినది లేదని ప్రపంచమునకు చాటి చెప్పిన మహ నీయులు మన రమణులు
  మన భారతీయ ఋషి పుంగవులలో అగ్రగన్యులు
 వీ రి  జీవితమును, బోధనను అధ్యయనము చేసి ప్రవర్తిల్లు వారు ధన్యు లు...! 


ఈ ప్రపంచములో నీ వున్న దెంత సత్యమో...., 
 నిలోనే ఈ ప్రపంచ మున్న దీ అంతే సత్యము...! 

 నోటి మాటలు కన్నా... 
 మౌనమే ఎక్కువ బోధిం చ గలదని నిరూపించిన మౌన స్వామి మన రమణులు...!

కామెంట్‌లు