ఎక్కువలో ...తక్కువ ..!!: -- డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 హైదరాబాద్ లో
అన్నీ -
తార స్తాయిలో ఉంటాయ్ !
చలి -
దీనికి మినహాయింపుకాదు !
శీతాకాలం వచ్చిందంటే 
ఎయిర్ కూలర్లు -
నోరుమూసుకుంటాయ్ ,
గీజర్లు కళ్ళుతెరుస్తాయ్ 
స్వెటర్లు....
రెక్కలువిప్పుకుంటాయ్ !
వీలున్న చోట 
చలిమంటలు 
విశ్వరూపం దాల్చి ....
సంక్రాంతి కి 
స్వాగతం పలుకుతుంటాయ్ !
సంతోషం ఏమిటంటె 
ఢిల్లీతో పోల్చుకుంటే 
ఇక్కడ పొల్యూషన్ తక్కువ !
అందుకే ---
హైదరాబాద్ లో -
పాపులేషన్ కూడా ఎక్కువ !!
                    ***

కామెంట్‌లు