ప్రియా !
వయసుపెరిగి
బ్రతుకు ఎదిగి
తనువు -
మోడవు తున్న తరుణంలో ,
ఎంత విచిత్రం ….
ఎడారిలో మంచువానలా ,
ఆపదలో -
ఆత్మీయబంధువులా ,
వడివడిగా వచ్చి వాలావు ,
నా ఒడిలో …. !
ఒక్కటి -....
ఒక్కటంటే ఒక్కటి ,
ఆశాబీజం -
నాటావు నామదిలో ,
ఎంత విచిత్రం … !
మరుక్షణమే -
మొలకెత్తింది ,
జీవితంపై మమకారం ,
చుట్టాను -కోర్కెలకు ,
సింగారపు శ్రీకారం !
ఇది నిజంగా -
మరీ .. మరీ ..
విచిత్రం సుమా …. !!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి