చిత్రానికి స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 *మత్తకోకిల*


ఉమ్మడైన కుటుంబమందున వుండు సౌక్యము వేళలన్
కమ్మనైనను వంటలందున గావరంబుగ భోజనాల్
చిమ్మ చీకటిలోన నిద్రకు చెప్పు గాథలు రాత్రులన్
నిమ్మలంబుగ నిద్రబోయిరి నిండ దుప్పటి మంచమున్

*కందం*

గంపేడు పిల్లలున్నను
గుంపుగ సందడవునిల్లు గూడిన చోటన్
ఇంపుగ మంచము నిండన్
దుప్పటి కిరువైపులందు దూరిరి చిత్రంబై!

కామెంట్‌లు