పూలపుణ్యం:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
చెట్లకు
పూస్తాయి
కళ్ళను
కట్టేస్తాయి

మొగ్గతొడిగి
మురిపిస్తాయి
విచ్చుకొని
విస్మయపరుస్తాయి

రంగులు
అద్దుకుంటాయి
హొయలు
పోతాయి

షోకులు
చూపుతాయి
సౌరభాలు
వెదజల్లుతాయి

మాలగ
మార్చబడుతాయి
సిగలన
సింగారమవుతాయి

కొప్పులు
ఎక్కుతాయి
కోమలులను
కుషీపరుస్తాయి

గుడికి
చేరుతాయి
దేవుని
కొలుస్తాయి

ప్రేమికుల
చేతులుమారుతాయి
ప్రేమను
వ్యక్తపరుస్తాయి

సత్కవులను
సన్మానిస్తాయి
వధూవరులను
వేడుకపరుస్తాయి

పూలు
మదులనుదోస్తాయి
విరులు
మరులుకొల్పుతాయి

పూలుచేసుకున్న పుణ్యం
వర్ణనాతీతం
కవులకిస్తున్న ప్రేరణం
శ్లాఘనీయం


కామెంట్‌లు