అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో చాలా కాలంగా వర్షాలు పడలేదు. రైతులు దిగులుపడేవారు.వాళ్లకు వారి పొలాల్లో ఏ పని ఉండేది కాదు అందరూ కాలీగా ఉండేవారు.కానీ ఒక రైతు మాత్రం రోజు తన పొలంలో పని చేసేవాడు.ఒక రోజు ఒక మేఘం వచ్చి ఆ రైతును ఇలా అడుగుతుంది "నేను మీకు వర్షాన్ని ఇవ్వడం లేదు కానీ నువ్వు మాత్రం రోజు నీ పొలంలో పని చెస్తున్నవ్ " అని అడిగింది, అప్పుడు ఆ రైతు నేను నా పొలంలో రోజు పని చేస్తున్న ఎందుకు అంటే " నేను నా పని చేయక పోతే నేను నా పనిని మార్చిపోతను " అని చెప్పాడు ,అప్పుడు ఆ మేఘం ఇలా అనుకుంటుంది "నేను నా పనిని చేయక పోతే నేను కూడా నా పనిని మర్చిపోత "అని అనుకొని అప్పడి నుండి వర్షాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది.అప్పడి నుండి ఆ రైతులు ఆనందంగా జీవించారు.
తెలివైన రైతు:- భూపతి శరణ్య-ఎనిమిదవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి