కవిని కాను నేను,
రచనా వ్యాసంగం
తెలియదు నాకు,
గ్రంధప్రభంధాలతో,
పరిచయం లేదు నాకు,
నాకు తెలిసిందల్లా
నీవే ప్రియ చెలీ....!
నేను రాసే--
ప్రతి అక్షర మాలికా
నీ కోసమే సుమా!
ఆమని--
నీ అందానికి మురిసి,
నీ వెంట పడుతోంది..
నీ పైట--
పైరుగాలికి,
తోట లోని పూలన్నీ..
విరబూసి-
వికసిస్తున్నాయ్ చెలీ!
చిలిపిగాలులు
నీ..ఎద పమిటనుజార్చి
ఫక్కున నవ్వుతూ
పరుగులు తీశాయి!
నా..వూహల వూయలలో
ఎప్పుడూ నీవే-
వూగుతున్నావుగా నా..చెలీ!
నీ చిరునవ్వుల -
వెండి వెన్నెల్లో....
కర్పూర క ళి క నౌతున్నా..!
చెలీ...నీ...
సౌందర్య పిపాసినైన నాకు
కవిత్వం....
ఆశువుగా వచ్చేస్తుంది సుమా!!
***
చెలికోసం ...!!---డా.జి.నాగేశ్వరరావు.- హైదరాబాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి