తెలుగు కూటమి రచ్చబండ సమావేశంది

 తెలుగు కూటమి రచ్చబండ సమావేశందిగ్విజయం గా శనివారం ముగిసింది.ఈ సమావేశంలోముఖ్య అతిథిగా తెలంగాణా సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు  బాలాచారిగారువిచ్చేసి తెలుగు భాషఅంతరించి పోతుందని చింతిoచ వలసిన అవసరం  లేదని  తెలుగు  భాష అభివృద్ధికొరకు తెలంగాణాసాంస్కృతిక శాఖ వారు  ఎన్నో కార్యక్రమాలు  నిర్వహిస్తూన్నాయని చెప్పారు, అవేకాక, కొత్తగా  కవులను  ప్రోత్సహించడానికి, కవిసమ్మేళనా లు, పుస్తకవిష్కరణ, సమీక్షల కార్యక్రమాలను ప్రభుత్వం  ప్రవేశ పెడుతుందని  తెలియచేసారు. ఇది మన మాతృభాషా అభిమానులకు ఆశాకిరణం.
ఈ కార్యక్రమంలో కూటమి అధ్యక్షు లు పారుపల్లి కోదండయ్య, .వ్యవస్థాకురాలు
p.సుధారాణి ,కూటమి కార్యనిర్వాహకురాలు డా. కోదాటి అరుణ, జెర్మనీ నుండి అభిలాష్, జిడుగు రవీంద్రనాథ్, పద్మావతి ఇంకా  తదితరులు  పాల్గొన్నారు. అనేకమంది  తెలుగుబాష అభిమానులు  పాల్గొని కార్యక్రమాన్ని  విజయవంతం  చేసినందుకు డా. అరుణ కోదాటి అందరికీ  కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్‌లు