అన్నం విలువ:- వగ్గు దర్శిష్ భార్గవ్-ఏడవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
 అనగనగా ఒక ఊరు ఉండేది, ఆ ఊరిలో ఒక పాఠశాల ఉండేది, ఆ పాఠశాలలో ఒక పిల్లవాడు ఉండేవాడు, అతని పేరు రాము, బడికి రోజు అన్నం తీసుకొచ్చేవాడు, రాము రోజూ అన్నం తినకుండా చెత్తలో వేసేవాడు, ఒకరోజు తన మిత్రుడు తన దగ్గరికి వచ్చి, రాము రోజు నువ్వు అన్నం ఎందుకు చెత్తలో వేస్తున్నావు అని అడిగాడు, ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే వాడు రాము,అలాగే ఒకరోజు రాము ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక బిచ్చగాడు బాధపడుతూ రాముకు కనిపించగా, అతనికి దగ్గరికి వెళ్లి ఏమైంది అని, ఆ బిచ్చగాన్ని అడగగా బిచ్చగాడు ఏమని అన్నాడు అంటే నాకు బాగా ఆకలిగా ఉంది నాయనా, నాకు కొంచెం అన్నం పెడతావా అని అడిగాడు, అప్పుడు రాము తన బ్యాగులో చూసేసరికి బ్యాగులో అన్నం లేదు ఎందుకంటే అంతకుముందే తాను తెచ్చిన ఆహారం చెత్తలో పడవేశాడు, తను పరుగు పరుగున ఇంటికి వెళ్లి అన్నం తీసుకుని వచ్చే లోపల, ఆ బిచ్చగాడు కళ్ళు తిరిగి పడిపోతాడు, అయ్యో అని రాము తన అమ్మకు చెప్పగానే తన అమ్మ అంబులెన్స్ కు ఫోన్ చేసింది, వాళ్లు వచ్చి ఆ బిచ్చగాడిని తీసుకొని వెళ్లారు, ఆ రోజు నుండి రాము ఎప్పుడు అన్నం చెత్తలో వేయలేదు. 

ఈ కథలోని నీతి: అన్నం విలువ తెలిసినవాడు, అన్నం ఎప్పుడూ చెత్తలో వేయడు

కామెంట్‌లు