అనగనగా ఒక ఊరిలో నరసయ్య అనే చేపలు అమ్మే వ్యక్తి ఉండేవాడు, అతనికి ఒక కొడుకు పుట్టాడు, అతని కొడుకు పేరు మహేష్, మహేష్ కు చదువు అంటే చాలా ఇష్టం కానీ, నరసయ్య దగ్గర డబ్బులు లేవు, కాబట్టి తన కొడుకును చదివించుకునేవాడు కాదు, ఒకరోజు నరసయ్య చేపలు పట్టడానికి చెరువు దగ్గరికి వెళ్ళాడు, చేపలు పడుతుంటే నరసయ్యకు ఒక బంగారు చేప వలలో చిక్కింది. ఆ చేపను అమ్మి తన కొడుకును మంచిగా చదివించుకోవచ్చు అని అనుకున్నాడు. కానీ చేప నేను పెద్ద చెరువు నుంచి చిన్న చెరువుకి నీళ్లలో కొట్టుకొని వచ్చాను. దయచేసి నన్ను మా అమ్మ దగ్గరికి చేర్చవా,అని బంగారు చేప నరసయ్య తో అన్నది,చేప అన్నది విని చేపను చెరువులో వదిలిపెట్టాడు. చేప చెరువులోకి వెళ్లి ఒక బంగారు ముత్యం తెచ్చి నర్సయ్యకు ఇచ్చింది,నరసయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ముత్యాన్ని అమ్మి తన కొడుకును చదివించుకున్నాడు.
ఈ కథలోని నీతి: ఇతరులకు సహాయం చేస్తే, మనకు కూడా ఏదో ఒక విధంగా లాభం కలుగుతుంది
ఈ కథలోని నీతి: ఇతరులకు సహాయం చేస్తే, మనకు కూడా ఏదో ఒక విధంగా లాభం కలుగుతుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి