విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ
 -ఊషన్నపల్లి పాఠశాలలో స్వయంపాలన దినోత్సవం
 -బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుడికి ఘన సన్మానం
కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామపంచాయతీ ఊషన్నపల్లిలోని ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వయంపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్టినీ, విద్యార్థులు
ఉదయాన్నే ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల వేషధారణలో పాఠశాలకు వచ్చి, వారికి నిర్దేశించిన పాఠాలను చక్కగా బోధించారు. ఎల్కేజీ నుంచి ఆరు తరగతులకు సంబంధించిన తెలుగు, ఆంగ్లం, గణితం, పరికరాల విజ్ఞాన సబ్జెక్టులను చక్కగా  బోధించారు. పిల్లలు పాఠ్యాంశాలను బోధిస్తుండగా, హెచ్ఎం ఈర్ల సమ్మయ్య ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్ లు పర్యవేక్షించారు. తాము ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులుగా వ్యవహరించామనే ఆనందంతో పాఠశాల పిల్లలు ఎగిరి గంతులేశారు. భవిష్యత్తులో బాగా చదువుకుని పెరిగి, పెద్దయ్యాక టీచర్ల మవుతామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. స్వయంపాలన కార్యక్రమానికి ముందు పాఠశాలలో హెచ్ఎం ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. తరువాత పిల్లలు తయారుచేసిన గణితం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టిఎల్ఎం) ప్రదర్శించారు. మధ్యాహ్నం భోజన విరమానంతరం పాఠశాలలో పనిచేసి, బదిలీపై వెళ్లిన పి. మల్లేష్ అనే టీచర్లను హెచ్ఎం ఈర్ల సమ్మయ్య, అమృత సురేష్ కుమార్, పిల్లలందరూ కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, పి.మల్లేష్, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.

కామెంట్‌లు