ఇతరులకు సాయం చేయడం:- గట్టిగోర్ల నేహా-ఏడవ తరగతి-ఆదర్శ పాఠశాల – వల్లాల
 అనగనగా ఒక వ్యాపారి అతనికొక గుర్రం మరియు గాడిద ఉన్నాయి. ఆ వ్యాపారి దూర ప్రాంతం బయలుదేర వలసి వచ్చింది.గాడిద మీద సరుకులు వేశాడు,గుర్రాన్ని ఖాళీగా నడిపించ సాగారు, సగం దూరం నడిచాడు గాడిద బరువును మోయలేక పోతుంది, నేస్తం నా బరువులో సగం నీవు తీసుకో అంది గాడిద, గుర్రంతో. గుర్రం పక్కున నవ్వింది నీవు గాడిదవు..... బరువులు మోయటం నీ పని గుర్రం, గాడిద అవుతుందా అని అన్నది. కొంత దూరం ప్రయాణం సాగింది ఆ బరువు మోయలేక గాడిద ప్రాణాలు విడిచింది. వ్యాపారి గాడిద బరువును దించారు, ఆ సరుకులు అన్ని గుర్రం మీద వేశాడు, గుర్రానికి కళ్ళు తిరిగాయి, బాబోయ్ ఇంత బరువా అనుకుంది. అరే ఎంత పొరపాటు చేశాను, గాడిద అడిగినప్పుడే సగం బరువు తీసుకోవాల్సింది, చెరిసగం మోసే వాళ్ళము, గాడిద కూడా బతికేది, ఇప్పుడు బరువు అంతా నా మీద పడింది, అని విచారించింది గుర్రం. 

ఈ కథలోని నీతి : ఇతరులకు సాయం చేస్తే, మనకు విలువ ఉంటుంది

కామెంట్‌లు