నీకో తోడు కావాలి ,
తప్పు లేదు....!
నువ్వువంటరితనాన్ని జయించడానికి
నీకో తోడుకావాలి ...
తప్పులేదు....!
నీవంటరి తనాన్ని -
చీల్చిచెండాడడానికి నీప్రక్కన
నీకోతోడుకావాలి
తప్పులేదు.....!
నీలో చెలరేగె అలజడుల
అగ్నిపర్వతాల్ని ఢీకొనేందుకు
నీప్రక్కన నీకోతోడుకావాలి
తప్పు లేదు....!
అర్ధరాత్రి వంటరిగా
ట్యాంక్ బండ్ మీద
స్వేచ్చగా విహరించే నీకు
తోడుగా ఒక నీడ కావాలి
తప్పు లేదు...!
నలుగురిలా నటించడానికి
లేని దేవుడి భక్తిని తెచ్చుకుని
దేవాలయాలు దర్శించడానికి
నీకోతోడు కావాలి....
తప్పు లేదు...!
నిజం --నీలా
అవసరానికితోడుకోరుకోడం
తప్పుకాదుకానీ ,
వంటరితనం బ్యాడ్జి పెట్టుకుని
తుంటరిపనులు చేయాలను కోవడం
మహాతప్పు కదూ....!!
***
తప్పు ..తప్పూ ....!! --డా.కె.ఎల్.వి.ప్రసాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి