శివానందలహరి:- కొప్పరపు తాయారు.

 శ్లో: అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతో ఫలం సూచికా
 స్వాథ్వీ నైజవిభుం లతా రుహం సింథుః సరిద్వల్లభమ్!
ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవింద
ద్వయం
చేతోవృత్తిరుపేత్య తి‍ష్ఠతి సదా ‌సా భక్తిరిత్యుచ్యతే !.

భావం: నిజమైన విత్తన సంతానం తల్లి అంకోలా చెట్ట చేరినట్లు, ఇనుప సూది రాయికి చేరినట్లు, పవిత్రమైన స్త్రీ తన స్వామిని చేరినట్టు, లేత లత చెట్ల దగ్గరకు చేరినట్లు, నది సముద్రాన్ని చేరినట్లు , మనసు యొక్క ఆత్మ పశుపతి యొక్క పాదపద్మాలను చేరి ఎల్లప్పుడూ అక్కడే ఉంటుంది అప్పుడు ఆ స్థితి భక్తి అంటారు. 
                    *****

కామెంట్‌లు