గణితం!!:- డా.ప్రతాప్ కౌటిళ్యా
లెక్కలు లేకుండానే 
విశ్వం రూపుదిద్దుకున్నది.!!
కానీ 
లెక్క ప్రకారమే రూపం ఏర్పడ్డది.!

భూమిపై జీవం ఏర్పడ్డానికి 
లెక్కలేం లేవు!!?
కానీ 
ఒక లెక్క ప్రకారమే జీవం ఏర్పడ్డది!!

పదార్థం పుట్టుకను కనిపెట్టింది 
లెక్కలే!!
పదార్థాన్ని నిర్మించింది-లెక్కలే!!!

విశ్వ నిర్మాణంలోని నాలుగు శక్తులను 
లెక్క కట్టింది -లెక్కలే!!

లెక్కలు లేకుండా ఏ శాస్త్రము లేదు. 
లెక్కలు లేకుండా ఏ శాస్త్రాన్ని 
శాస్త్రీయంగా స్వీకరించలేం.!!!

గణితము గారడీ కాదు కానీ 
గారడీ అంతా గణితమే!!!?

గణితము వింత కాదు కానీ 
మాయలు వింతలన్నీ గణితమే.!!?

కాంతి విద్యుత్తు కంప్యూటర్ అంతా 
డిజిటలే అంతా గణితమే.!!

క్వాంటం ఫిజిక్స్ స్పేస్ అండ్ టైం అంతా 
గణితమే.!!

సాపేక్ష సిద్ధాంతానికి సాక్ష్యము గణితమే.!
ఆది అంతము అంతా గణితమే!!!

పిండమైన బ్రహ్మాండమైన గడియారమైన 
గణితమే!!
గతమైన వర్తమానమైన భవిష్యత్తు అయిన 
గణితమే.!!!

తత్వశాస్త్రం అన్ని శాస్త్రాలకు మూలం!
గణితం అన్ని శాస్త్రాలకు ముఖ్యం!!!

గణితం ఒక మార్గం గణితం ఒక పరికరం 
గణితం ఒక గొప్ప గుణం.!!!!

గణిత ఉపాధ్యాయిని శోభారాణి స్ఫూర్తితో. 

డా.ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు