న్యాయములు -718
శిబికో ద్యచ్చన్న రవత్ న్యాయము
*****
శిబికా అనగా పల్లకి.ఓద్యచ్చన్న రవత్ అనగా మోసుకొని పోవు వారి వలె.
"శిబికో ద్యచ్చన్న రవత్" అనగా పల్లకీ మోయు మనుష్యుల వలె"అని అర్థము.
పల్లకీ మోయు మనుష్యులు ఒకే మాదిరి స్థితిలో ఉండి దానిని అందరూ కలిసి మోసుకుని పోతారు.వారిలో ఎవరు తమ పనిని మానేసినా 'శిబికావహనము' అనగా పల్లకి ప్రయాణం సరిగా నెరవేరదు.
అదే విధంగా పదములన్నియు కలిసి వాక్యము యొక్క అర్థమును బోధించును. మోయువారు సరిగా కలియకపోయినా, సమన్వయము లేక పోయినా పల్లకి నిష్ప్రయోజనమైనట్లే, పదముల కలయిక అసందర్భములైన వాక్యర్థము సైతం అసంగతమయి దాని అర్థమే చెడిపోతుంది అంటారు మన పెద్దలు.
అంటే పదాలు సమర్థవంతంగా సాగితేనే వాక్యం రస రమ్యంగా ఉంటుందనీ, పదాల కూర్పు సరిగా ఉంటేనే వాక్యాలు ఆకర్షణీయంగా ఉంటాయనేది మనకు అర్థమై పోయింది.
మరి దీనిని ఇంకో కోణంలో కూడా చూద్దాం.పల్లకీని మోసే బోయీల వలెనే మన దేహాన్ని మోసే బోయీలు కూడా అంతే.వాళ్ళలో ఏ ఒక్కరూ సహకరించక పోయినా దేహ క్రియలకు అంతరాయం కలుగుతుంది.
ఇంతకూ దేహ బోయీలు ఎవరో ఈ పాటికి తెలిసే వుంటుంది. భూమి, నీరు గాలి అగ్ని ఆకాశం- అవే పంచ భూతాలు.
ఈ పంచభూతాలలో ఏ ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించక పోయినా మన దేహ ప్రయాణం సరిగా కొనసాగదు.
కాల్షియాన్ని భూమికి సంకేతంగా భావిస్తారు. భూమిలో ఉన్నట్లు గానే మన దేహంలోని ఎముకలలో కాల్షియం ఉంటుంది.ఆ ఎముకలే మనల్ని నిటారుగా నిలబెడుతాయి.
నీరు - ఈ భూమిపై 70%నీరు ఉందని మనం చదువుకున్నాం.అలాగే మన దేహంలో కూడా 70% నీరు వుంది.
గాలి- మన ఉచ్ఛ్వాస నిశ్శ్వాసముల ఊపిరిలో గాలిదే ప్రముఖ స్థానం. గాలి మన దేహాన్ని వీడితే అవుతాం నిర్జీవులం. మనం బతికి ఉన్నామో లేదో తెలిపేది గాలియే.
ఇక అగ్ని - మన దేహంలో 98.6ఫారన్ హీట్ డిగ్రీల శరీర ఉష్ణోగ్రత ఉంటుంది.తక్కువైనా ,ఎక్కవైనా ప్రమాదమే.
ఇక మిగిలింది ఆకాశం - ఇది ఎక్కడ ఉంటుందా? అని అందరికీ సందేహమే. తెలుసుకుంటే భలే ఆశ్చర్యం కలుగుతుంది. మన గుండె ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో పొందుపరచబడి వుంది. గుండె చేసే లబ్ డబ్ శబ్దానికి కారణం అది కొట్టుకోవడం అనగా సంకోచ వ్యాకోచాలు జరిగే క్రమము.మరి ఆ విధంగా గుండె కొట్టుకోవడానికి గల ప్రదేశాన్ని ఆకాశం అంటారు.ఆకాశం ఓ శూన్యం. ఇలా గుండె కొట్టుకోవడానికి ఉన్న ప్రదేశాన్ని శూన్యం లేదా ఆకాశం అని పిలుస్తారు.
ఈ విధంగా పంచభూతాల సమన్వయంతో మన దేహ రథం నడుస్తోంది. పల్లకీని మోసే బోయీల వలెనే మన దేహాన్ని పంచభూతాలు నడిపిస్తూ ఉన్నాయి.

ఈ పాటికి "శిబికో ద్యచ్ఛన్న రవత్ న్యాయము "అంటే ఏమిటో అర్థమైంది.
ఈ "శిబికోద్యచ్చన్నిరవత్" న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే సహకారం, సమన్వయం. ఇవి లోపిస్తే ఏ పనులూ జరగవు.అందుకే మన పెద్దలు ఇలాంటి చక్కని న్యాయాన్ని మనకు పరిచయం చేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి