ప్రేమమూర్తి కి పాదాభివందనం...!!---డా.కె.ఎల్.వి.ప్రసాద్.
 స్వార్ధము నీకు దూరము 
త్యాగము నీ ఊపిరి ....!
ప్రేమ ,అబిమానం .ఆత్మీయత 
నీ అభరణాలు ....
చెక్కుచెదరని -
నీ ఉక్కుసంకల్పంతో 
మాప్రగతికి 
నీజీవితమే ....
అంకితంచేశావు ....!
నీలోని వ్యధలను 
నీకునువ్వే దిగమింగుకుని 
మాసంతోషంకోసం 
మాభవితకోసం ....
నిత్యం -నువ్వు
నవ్వుతూనే బ్రతికావు ...!
ఇవ్వడమే గాని 
ప్రతిఫలం ఆశించని నీకు 
మేమేమిచేశాము నీకోసం
నీనుండి తీసుకొవడం తప్ప !
అక్కా ..నన్ను క్షమించు 
నాతప్పులేమైనా ఉంటే 
నీ చంటి తమ్ముడిని
మన్నిస్తావుకదూ ...!!
                ***
(అక్క కీ.శే.కుమారి కానేటి మహానీయమ్మ వర్ధంతి నేడు)

కామెంట్‌లు