కారు బొమ్మలు ...!!: ---డా.కె.ఎల్.వి.ప్రసాద్ .

 ఆటబొమ్మలకు 
ఆకర్శింపబడని 
పిల్లలుంటారా ?
బాల్యంలో -
బొమ్మలు కొనిపించుకోని 
బాలబాలికలుంటారా ?
ప్రటివారి నోటా ....
ఉండరనే మాట ,
వెంటనే వినిపిస్తుంటుంది !
అందరి సంగతి ఎలావున్నా 
మా మనవడు  నికోకి
బొమ్మలంటే బహుఇస్టం
'కారు' బొమ్మలంటే మరీను!
నికో బొమ్మల్లో...
కార్ల శాతమే ఎక్కువ...
వాటిని నేలమీదనే కాదు
మంచాలమీద...
సోఫాలమీద...
బల్లలమీద .....
చివరకి -
మనుష్యుల మీదకూడా 
జోరుగా నడిపించేస్తాడు !
కారుకూతలు -
మిమిక్రీ చేసెస్తాడు ,
బొమ్మలుంటేచాలు  నికో కి ,
వంటరిగా అయినా -
బ్రహ్మాండంగా ఆడుకుంటాడు !!
                  ***
కామెంట్‌లు