శివానందలహరి:- కొప్పరపు తాయారు.

శ్లో: ఆనందాశ్రుభిరాతనోతీ పులకం  నైర్మల్యత శ్ఛాదనం
వాచా శంఖముఖ స్థితైశ్చ  జఠరాపూర్తిం చరిత్రామృతైః
రుద్రాక్షైర్భసితేన దేవి వపుషో రక్షాంభవర్భావనా
పర్యంకే వినివేశ్యే భక్తి జననీ భక్తార్భకం  రక్షతి !!!

భావం:దేవా! ఓ శివా! భక్తి. అనెడి అమ్మ ఆనందభాష్పాలు  జారుతుండగా బిడ్డను చేరతీసే
విధంగా భక్తి రసము భక్తుడి శరీరము పులకించి 
ఉప్పోంగేట్లు చేస్తుంది,తల్లి బిడ్డకు చలివంటి బాధలులేకుండా నిర్మల  భావము అనే బట్ట కప్పు
తుంది..నాకు అనెడి శంఖము నందున్న భక్తి అనే
అమృతముతో కడుపు నింపుతుంది.రుద్రాక్షల
చేయను, విభూది చేతను రక్షణ కల్పించేందుకు.
నీ భావన అనెడి మంచము పై పరుండి బెట్టి
భక్తుడు అను శిశువును కాపాడును.
                    *****

కామెంట్‌లు