నేడు ఈనాడు నిర్వహించబడుతున్న నా భేటీ మేటి అని వెన్నెల మణిపూసలు పుస్తకావిష్కరణకు విచ్చేసిన సాహిత్య అభిమానులకు, ఆప్తులకు , బంధుమిత్రులకు, కళాపోషకులకు, కళాకారులకు, కవులకు, పత్రికా విలేకరులకు, శ్రేయోభిలాషులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలుపుతూ నా అచ్చట ముచ్చట పూర్వపలాలను ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా.
అసలు ఈ నూతన ప్రక్రియను కనుగొన్నవారు గౌ, శ్రీ వడిచర్ల సత్యం గారిని నాకు పరిచయం చేస్తూ మణిపూసలను రాయమని పదేపదే ప్రోత్సహించిన వారు శ్రీమతి చైతన్య భారతి రచయిత్రి హైదరాబాదు గారు. అలా ఈ మణి పూసలకు నేను శ్రీకారం చుట్టా. ఒక 100 మలుపులను రాసి మణిపూసల గ్రూపులో పెట్టా. వాటిని చదివిన మిత్రులు, గ్రూపు సభ్యులు వాటిని పుస్తక రూపంలో తెస్తే బాగుంటుందని నాకు సలహా ఇచ్చారు. శ్రీమతి చైతన్య భారతి గారు కూడా దానికి వత్తాసు పలికారు. ప్రక్రియ రూపకర్త గౌ, శ్రీ వడిచర్ల సత్యం గారు అంటూ నన్ను ప్రోత్సహించారు. అలా వీరందరి ప్రోత్సాహంతో నా ఈ వెన్నెల మణిపూసలను పుస్తకం రూపం లోకి తెచ్చాను. అలా ఈ మణి పూసలు పుస్తక రూపం దాల్చింది. ఆ పుస్తకమే ఇప్పుడు మీ హస్తాలను అలంకరించింది.
ఇక్కడ మీ అందరికీ మరో ముఖ్య విషయం తెలపాలి. నా ఈ మణిపూసలను మెచ్చుకొని కాగ్న కళా సమితి వేదిక ద్వారా "మణిపూసల కవి భూషణ"బిరుదునిచ్చి ముమెంటోతో శాలువా కప్పి సత్కరించిన గౌ, శ్రీ వడిచర్ల సత్యం గారికి, ప్రోత్సహించి వ్రాయించిన శ్రీమతి చైతన్య భారతి హైదరాబాద్ గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదములు. అలాగే ఈ పుస్తకాన్ని ప్రచురించుటకు దారి తెన్ను చూపిన తమ్ముడ బి. చెన్నారావు పాల్వంచ గారికి, అందంగా అచ్చువేసి ఇచ్చిన శ్రీ, శ్రీనివాసరావు డిడిపి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు . అమిత శ్రద్ధతోను నా అచ్చట ముచ్చటను ఆలకించిన మీ అందరికీ, ఈ న్యూస్ ను మీడియాకు కవరేజ్ చేసిన పత్రికా విలేకరులకు హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్న
మీ.............
సహస్ర కవిభూషణ.
- గుర్రాల లక్ష్మారెడ్డి,- కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి