*ఉన్నతి*:- పెందోట వెంకటేశ్వర్లు-బాల సాహిత్య వేత్త -సిద్దిపేట
 అక్షరాలు నేర్వరా 
అజ్ఞానం తరమరా 
అందరితో ఉండరా 
ఆసక్తులు పెంచరా

 విడవకుండా చేయరా
 ఇగురాలను చూపరా 
ఇలవేల్పును తలవరా
 ఇష్టంగా  ఎదగరా 

ఉన్నతికై పోరురా 
ఉత్సాహాన్ని నింపురా
ఉర్వి యంత తిరగరా 
ఉజ్వలంగా వెలగరా 

ఎప్పుడైనా ఎక్కడైనా 
ఓర్పుతోడ నేర్పుగా 
ఐక్యంగా ఉంటునే
ఔరా యనిపించరా


కామెంట్‌లు