ఏదో -
అడుగుతాడు
ఆ..పసివాడు,
అర్థం కాదు...!
ఏదో ---
సైగచేస్తాడు
అర్ధంకాదు ....!
మరోలా చెప్పలేక
ఏడుపు లంకించుకుంటాడు,
అప్పటికీ అర్ధంకాదు ...!
చికాకుచేస్తున్నాడని
చికాకుపడతాం ....
కోప్పడతాం ....
కొడతాం కూడ ...!
ఆలేత మనసుల్ని
అర్థం చేసుకోలేని మనం
తొందరపడతాం ....
సహనం కోల్పోతాం !
మాటలతో చెప్పలేని
పసివాడికి ....
మనకి అర్థమైనా కాకున్న,
ఏడుపుఒక్కటే మార్గం
నికో ..కాదు దీనిఁకతీతం !!
***
ఏకైక మర్గం ...!!: --డా.కె.ఎల్.వి.ప్రసాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి