సర్దుకోమనే సహనం ఎపుడూ
సహించలేనిదిగానే ఉంటుంది
సమయమయాక వచ్చే ఫలితం
సంతోషమిచ్చేదే అవుతుంది.
అందుకోవాలనుకునే శిఖరాలు
దూరంగానే ఉంటాయి....
భారంగానైనా సరే చేరుకున్నాక
పరమానందంగా ఉంటుంది.
నీతిగా ప్రతిక్షణం ఉండడం
కష్టంగానే ఉండొచ్చు..
నిజాయితీగా పాటించే వారికి
నిర్మలానందం నిండుగా ఉంటుంది.
నిరంతర ప్రయత్నం చేసే క్రమంలో
నిస్పృహ ఒకోసారి కలగొచ్చు
నిదానమైనా ప్రతి అడుగుకీ
గమ్యం చేరువవుతూనే ఉంటుంది.
సవరింపులు సర్దుబాట్లు
అసహనంగా అనిపించినా
కాలక్రమేణా పర్యవసానాలు
ఆమోదకరంగా ఉంటాయి.
అహము వీడి అనువుగా ఉంటే
అనుక్షణమూ అనుకూలమై
అహరహమూ అంతరంగం
ఆనందమయమే అవుతుంది.
వేడుకైనా వేదనైనా కాలంతో
సాగిపోయేదే!
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి