న్యాయములు-720
శిలా ఘన మధ్యస్థ ప్రదీప సహస్ర ప్రథనవత్ న్యాయము
****
శిలా అనగా రాయి. ఘన అనగా పెద్దదైన.మధ్యస్థ అనగా మధ్యలో. ప్రదీప అనగా దీపము.సహస్ర అనగా వేయి.ప్రథనం అనగా వ్యాప్తి,ప్రదర్శించుట, యుద్ధము.వత్ అంటే వలె అని అర్థము.
"రత్న శిలా మధ్యమున ఉంచబడిన యొక పెద్ద దీపము రాతి పలకలలో ప్రతిఫలించి కొన్ని వేల దీపములుగా భాసించు నట్లు"-అనగా విజ్ఞానము అవభాస కాన్తర అనగా వెలుగు కాంతి ప్రదర్శింపబడుతూ నిరపేక్షమై ఎలాంటి అపేక్ష లేకుండా, ఆధారపడకుండా తనకు తానే తానే భాసించును లేదా ప్రకాశించును.
ఒకానొక పెద్ద దీపం రాతి పలకల మధ్య వెలుగుతూ వుంటే దాని కాంతి ఆ పలకలలో వేన వేల దీపాలుగా ప్రతిబింబిస్తూ దాని యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే మనిషిలోని ప్రతిభ మరియు జ్ఞానం కూడా ఈ ప్రపంచం అనే పలకల మధ్య ప్రతిఫలిస్తుంది. తనకు తానే ప్రకాశిస్తూ ఆ ప్రకాశం చేత పరిచయం కాబడుతుంది.
అనగా జ్ఞానము అనేది సూర్యుని లాంటిది. ఎందుకంటే సూర్యుడిని ఎవరూ వెలిగించనక్కర లేదు. ప్రకాశింప చేయనవసరం లేదు.ఎందుకంటే సూర్యుడు స్వయం ప్రకాశ కుడు.
మరి అలాంటి జ్ఞానవంతులు కూడా తమ యొక్క ప్రతిభా పాటవాలు, మేధస్సు చేత తమకు తాముగా ప్రపంచానికి పరిచయం కాబడుతారు.
ఆధ్యాత్మిక వాదులు ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటారు. అలా వారు భగవద్గీతలో ఆధ్యాత్మిక జ్ఞానము గురించి చెప్పిన శ్లోకాన్ని చూద్దామా...
"జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితాత్మనః!/తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం!!/
కానీ ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే, అజ్ఞానం నాశనం చేయబడునో, సూర్యుడు ఉదయించినప్పుడు అన్నింటినీ ప్రకాశింప చేసినట్టు, వారికి జ్ఞానము పరమాత్మను ప్రకాశింపజేయును.
వ్యక్తులలో కలిగిన దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం పరమాత్మను ప్రకాశింప చేస్తుందని చెబుతూనే... అజ్ఞానం అనేది కూడా ఎంత కప్పి పెట్టితే అంత ఎక్కువ అవుతుంది.నిజాయితీగా మనలోని అజ్ఞానాన్ని అంగీకరిస్తే ఎప్పటికైనా తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటారు.
మొత్తానికి మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే దీపం తనను తాను ప్రకాశింప జేసుకున్నట్లే మనిషిలోని ప్రతిభ మరియు సమర్థత ఎంత దాచాలని ప్రయత్నించినా దాగేవి కావు. ఎప్పటికైనా తమను తాము పరిచయం చేసుకుంటాయి. కేవలం ఒక్క ప్రతిభ, మేధస్సు మొదలైనవే కాదు. మంచితనం, మానవీయ విలువలు కూడా ఏదో ఒక సమయంలో గుర్తింపబడతాయి అనే ఉద్దేశంతో""శిలా ఘన మధ్యస్థ ప్రదీప సహస్ర ప్రథనవత్ న్యాయము"తో పోల్చి, వ్యక్తులకు అన్వయిస్తూ మన పెద్దవాళ్ళు దీనిని ఉదాహరణగా చెబుతుంటారు.
కాబట్టి మనం కూడ మన ప్రతిభతో,స్వయం ప్రకాశ దీపాలమై వెలుగుదాం. ఓ కవి "నీలో దీపం వెలిగించు - నీవే వెలుగై వ్యాపించు "అన్నారు.ఆ విధంగా వ్యాప్తి చెందిన ప్రతిభా సామర్థ్య వెలుగుతో ఇతరులను వెలిగిద్దాం,

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి