అనగనగా ఒక రామరాజుపురం అనే ఒక పల్లెటూరు ఉండేది,అక్కడ ఉన్న ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు, వాళ్ల ఊరిలో ఉన్న సర్పంచికి చాలా కుల భేదాలు ఉండేవి, అంటే మీ కులం తక్కువ, మా కులం ఎక్కువ అని భావించేవారు,ఆ సర్పంచ్ అలా వాళ్ల కులం వారు తప్ప ఏ కులం వారైనా ఆ సర్పంచ్ యొక్క పనులను చేస్తే, ఆ సర్పంచ్ కి చాలా కోపం వేసేది, వాళ్లకు చాలా పెద్ద పెద్ద శిక్షలు వేసేవాడు, అలాగని వాళ్ళ కులం వారు వేరే కులం వారికి సహాయం చేసిన కూడా ఆ సర్పంచి వాళ్లను చాలా కోపగించేవారు, పాపం ఆ ప్రజలు చాలా బాధపడేవారు, వాళ్లకు చాలా కష్టమైపోయింది, ఆ సర్పంచ్ వల్ల, ఎలాగోలా మా కష్టాలను తొలగించు దేవుడా, అని వాళ్లందరూ దేవుడికి మొరపెట్టుకున్నారు, అలా ఒకసారి సంక్రాంతి పండుగ రానే వచ్చింది,ఆరోజు కోడిపందాలు ఆట ఆడాలి అంటూ ప్రజలు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. సర్పంచ్ కి కొద్ది రోజుల ముందు నుంచే ఆరోగ్యం బాగాలేదు,ఆ సంక్రాంతి రోజే ఆ సర్పంచ్ కి గుండెపోటు వచ్చింది, కానీ వాళ్ళ ఇంట్లో ఎవరూ లేకపోవడం వలన ఆ సర్పంచ్ చాలా పెద్ద పెద్దగా మొత్తుకుంటున్నాడు, అలా ఇంటి దారిలో కొంతమంది ప్రజలు పోతున్నారు, ఆ చప్పుడు విన్న ప్రజలు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా సర్పంచ్ కిందపడి ఉన్నాడు, దాంతో ప్రజలు ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు, సర్పంచి క్షేమంగా బతికిపోయాడు, అప్పుడు ఆ సర్పంచ్ కి అర్థమైంది, ఏంటంటే కులాలను కాదు, మంచి మనసును చూడాలి, మంచి మనుషులను చూడాలని, అప్పుడు ఆ సర్పంచ్ కి అర్థమైంది, అప్పటినుంచి ఆ ఊరి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండసాగారు.
ఈ కథలోని నీతి: కులాలు, మతాలు కాదు ముఖ్యం, మంచి మనసు కావాలి
ఈ కథలోని నీతి: కులాలు, మతాలు కాదు ముఖ్యం, మంచి మనసు కావాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి