స్వప్న సుందరి : డా. కె ఎల్వీ

 కలగంటినే  సుందరీ
కలగంటినే ....
కలగంటి ..కలగంటి 
కలలోన నిను కంటి ,
కలగంటినే సుందరీ
కలగంటి ...    !
పట్టుచీరలోన 
పసిడిబొమ్మలానీవు 
చిరునవ్వు చిందింస్తూ 
కనువిందు చేసావు 
ఆనందమేపంచావు !         //కలగంటినె//
కొప్పులో పువ్వేట్టి 
నుదుట చిన్న బొట్టెట్టి 
అందంగా పెదవులకు 
పసందుగా రంగు -
పులుముకుని ...
ముద్దుముద్దుగా నువ్వు 
ముచ్చట్లు చెబుతుంటే 
నీ మురిపించే అందాలు 
నామదిలో సెగలు --
రేకిస్తుంటే ...
ఎగిరి గంతేసి నిన్ను 
హత్తుకోబోయేలోపు 
నా ..కలచెదిరిపోయింది 
సుందరీ...
నాకు మతి పొయినట్లయింది
సుందరీ...
కలగంటినే సుందరీ
కలగంటినే ....
కలగంటి ..కలగంటి ...
కలలోన నిన్నేమో ....
దరిచేరలేకుంటి --
కలగంటినే సుందరీ
కలగంటి నే ,
కలచెదరి నీజాడ
తెలియకుండాపోయే ...!         //కలగంటినే //
                    ***

కామెంట్‌లు