పాల బుగ్గల పాపాయి:- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
అల్లరి చేసే పాపాయి
ఆటలాడుతూ రావోయి 
అమ్మ ఒడిలో చేరోయి 
హాయిగా నీవు ఉండోయి

పాల బుగ్గల పాపాయి 
పసిడి పలుకులు పలుకోయి 
పలుకు పలుకు తో నీవు 
మెలికలు ఎన్నో  నేర్వోయి 

బుడిబుడి అడుగుల పాపాయి 
తడబడని అడుగులతో
వడివడిగా  తిరుగుతూ
సుడిగాలిలా రావోయి 

కిర్ కిర్ మనే శబ్దంతో
గిరగిర నీవు తిరుగుతూ
బిర బిర నడుచుకుంటూ 
గిరుకల బండిని పట్టోయి


కామెంట్‌లు