జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాలలోశనివారం శ్రీమతి ఎడ్ల లక్ష్మి గారు 300 కు పైగా బాల సాహిత్య గ్రంథాలను పాఠశాల గ్రంథాలయానికి అందించడం జరిగింది.పుస్తకాలు చదవడంవలన విజ్ఞానం పెరుగుతుందని అందుకే విద్యార్థులు గ్రంథాలయాలను వినియోగించుకోవాలని తెలియజేశారు.
అనంతరం తాను రచించిన చిలుకల బండి బాలగేయ సంపుటిని శ్రీ నాగేందర్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు గారిచే ఆవిష్కరించబడింది. ప్రకృతిలో లభించే ప్రతి వస్తువు పైన బాల గేయాలు రాయవచ్చని అభిప్రాయపడినారు బాల్యం అమూల్యమైనదని బాల్యంలో నేర్చుకున్న విషయాలను గేయాలుగా మరిచినట్లయితే తెలుగు భాష సులభంగా విద్యార్థులకు అర్థమవుతుందని తెలియజేశారు.
పుస్తక రచయిత శ్రీమతి ఎడ్ల లక్ష్మి గారు మాట్లాడుతూ పరిసరాలలో ఉండే ప్రతి వస్తువును ఎన్నుకొని గేయాలుగా రాయవచ్చని విద్యార్థులకు తన పాటలు పాడి వినిపించారు.ఎన్నవెల్లి రాజమౌళి కథల తాతయ్య గారు విద్యార్థులకు కథలు ఎలా చెప్పాలో వివరించారు. పుస్తక సమీక్షకులు శ్రీ వర్కోలు లక్ష్మయ్య పుస్తకంలోని గేయాలను లయాత్మకంగా పాడి వినిపించారు.ఈ కార్యక్రమంలో భాగంగా నాగేందర్ రెడ్డి, పూర్ణచందర్రావు, వర్కోలులక్ష్మయ్య,ఎడ్ల భూమిరెడ్డి,ఎడ్ల లక్ష్మి,పిడపర్తి అనిత,ఎన్నవెల్లి రాజమౌళి, సుహాసిని, శ్రీశైలం, రమాదేవి, సునీత, ఆగయ్య, శ్రీనివాస్ గారలు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి