అనగనగా ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉండేవారు, ఆ నలుగురు చాలా కలిసి మెలిసి ఉండేవారు, ఆ నలుగురిది విడదీయలేని బంధం, ఒక్కరోజు ఆ నలుగురు ఒక పార్కు వెళ్లారు, ఆ నలుగురు కలిసి వెళ్తుంటే ఒక దొంగ వాళ్ళని గమనిస్తూ వాళ్లతో పాటు వెళ్ళాడు, కానీ వాళ్లకు తెలియదు, కానీ వాళ్లు విడివిడిగా వెళ్లడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్లకు శబ్దం వినిపించింది, వాళ్లు ఆ శబ్దం కి భయపడి ఒకచోట దాక్కున్నారు, ఆ దొంగ వాళ్ళని కిడ్నాప్ చేయాలని అనుకున్నాడు, కానీ ఆ నలుగురు ఒక ఉపాయం ఆలోచించారు, ఆ ఉపాయం ఏమిటి అంటే మనం అందరం కలిసి అక్కడ ఒక వల ఉంది, ఆ వలను తీసుకుని రెండు చెట్లకి కట్టి, తాను ఇటు వచ్చేటప్పుడు, ఆ వలను విసిరి వేద్దాం అప్పుడు ఆ దొంగను పట్టుకోవచ్చు అని అనుకున్నారు, వాళ్ళు అనుకున్నట్లే, అనుకున్నది సాధించారు, కానీ వాళ్లు వచ్చిన దారి తెలవడం లేదు. ఒక ఆమెకు ఒక ఉపాయం దొరికింది, కానీ ఆ ఉపాయం ఏమిటి అంటే దొంగను పట్టుకున్నాము కదా! ఆ దొంగ జేబులో ఫోన్ ఉన్నదేమో చూద్దాం, ఆ దొంగ జేబులో ఫోన్ ఉన్నది, ఒక ఆమె ఈ ఫోన్ను ఏం చేస్తావు అని అడిగింది, ఈ ఫోన్ ద్వారా మనం ఎక్కడ ఉన్నాము తెలుసుకోవచ్చు అని అన్నది. వారు ఈ ఫోన్ తో వారి ఇంటికి వెళ్లారు, వాళ్లు అనుకున్నది సాధించారు, తెలివిగా ఫోన్ తీసుకొని ఇంటిదారి తెలుసుకొని వెళ్లారు.
స్నేహితుల తెలివి :- ఆర్.తేజశ్రీ-ఏడవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి