సుఖ- దుఃఖ భూయిష్ఠ మైన బాహ్య ప్రపంచపు ఆకర్షణలకు చిక్కిన మనసు...
ఆ ఎండమావులభ్రమలో పడి , తిరిగి-తిరిగి ఆలసి, సొలసి,విసిగివేశారటంతప్ప, ఆనంద మేమున్నది!?
ఓ జీవా...!
నీ వాశించిన ఆనందం బయట కాదు ... నీ లోనే వుంది...!
ఏకాగ్రత తో....స్థిర చిత్తు డవై అంతర్ముఖుమున ధ్యా నించు .... ,
నే నె వ రు...నే నె వ రు....
నాకన్ను,నాకాలు...నా చే యి, నా శ రీ రం ...
మరి నే నె వ రు...?!
నా మతి... నాబుద్ది...నా ప్రాణం... మరి నేనెవరు!?
ధ్యా నిం చు....ఏకాగ్రతతో ధ్యానించు ...!
నేను..నేను అనుకుంటున్న
ఈ నే నే, "నేను" కానపుడు ఇంక ఈ ప్రపంచములో "నాది" అనే దేమున్నదో... ఆలోచించు...!
అర్ధ మౌతుంది...!!
నీ ఆశలు,కోరికలు, వ్యా మోహాలు,ఆవేసాలు, కావే సాలు,వంచనలు,దోచుకోటాలు,దాచుకోటాలు,ఘర్షణలు,అలజడులు,అశా0తి...అన్నీ సమసిపొతాయ్
మనో బుద్ది చిత్యహంకా రాలు ఆత్మలో లీనమై నిశ్చల యోగ స్థితిలో , నిజాత్మా నందాబుధిలో
అ నిర్వచనీయానంద పరవసుడవవుతావ్ !!
నీ శారీరక , మానసిక రోగాలన్నీ దగ్ధమై పోతా యి!
బాహ్య మాలిన్యా లేవీ....
నిన్నిక అంట జాలవు !
లే స్థిర చిత్తుడవై నిశ్చల ధ్యానముతో యోగిగా మా రు, పరి పూర్ణ ఆరోగ్యము, ఆనందములతో హాయినొం దు...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి