ఏసుక్రీస్తు త్యాగాలకు ప్రతిరూపం:- కావ్య సుధ
  ప్రపంచంలో ఎక్కువశాతం మంది ప్రజలు జరుపుకునే పవిత్రమైన పండుగ క్రిస్మస్. క్రైస్తవులు ఈ పండుగను ఎంతో ఘనంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. వీరి ప్రార్థనా లయాలైన చర్చిల వద్దా, నివాస గృహాలవద్దా రంగురంగు దీపాలతో అలంకరిస్తారు. క్రైస్తవులందరూ ఉదయమే లేచి చర్చిలకు వెళ్ళి ఏస య్యను ప్రత్యేక ప్రార్ధనలు, ఆరాధనా గీతాలతో కొలుచుకుంటారు.
పాపులను పరిరక్షించేందుకు పరలోకంనుంచీ దిగివచ్చిన ప్రభువు ఏసు. ఏసుక్రీస్తు అంటే కరుణ. శాంతి, ప్రేమ, జాలి, అహింస, త్యాగాలకు ప్రతిరూపం. అలాంటి కరుణామయుణ్ని సైతం కరడు కట్టిన క్రౌర్యానికి బలి చేసిందానాటి మూర్ఖలోకం. పడిపోతున్న మానవతా విలువలను పునరుద్ధరించేందుకు ప్రయత్నించిన పరిశుద్ధాత్ముడినే దారుణంగా హింసించి, శిలువవేసి ప్రపంచానికి దూరం చేశారా పాపాత్ములు. తననంత వేధించి చంపుతున్నా వారందరిని కరుణిం చమని దైవాన్ని ప్రార్థించాడా మహనీయుడు. కాబట్టే ఆయన ప్రభువుగా అందరిగుండెల్లో ఆరాధ్యుడయ్యాడు.
ఏసంటే రక్షకుడు, క్రీస్తంటే అభిషిక్తుడనంటారు. మానవులను రక్షించేందుకు, మృగ్యమవుతున్న విలువలను మనిషిలో పాదు కొలిపేందుకు శిలువను మోసేందు కైనా సిద్ధపడ్డ త్యాగ మూర్తి ఏను. కొన్ని వందలసంవత్సరాల క్రితం మరియ అనే కన్యకు జన్మించాడు. ఏసు. ఈ విషయాన్ని దైవదూత మరియకు ముందుగానే తెలియ చేస్తూ పుట్టిన శిశువుకు ఏసుక్రీస్తని పేరు పెట్టమని సూచిస్తాడు. ఇదే సంగతి మరియ భర్త జోసఫెకూ చెబుతాడు. అప్పుడతను భార్యతో తమ పూర్వీకుల స్థలమైన బెత్లహేం కు వెడతాడు. అయితే, అప్పటికే నెలలు నిండిన మరియ మార్గ మధ్యంలోని ఒక పశువులపాకలో సర్వలోకానికి ప్రభువైన ఏసుకు జన్మనిస్తుంది.
ఇదే సమయంలో ఆకాశంలో కోటికాంతులతో దివ్యమైన నక్షత్రం ప్రకాశిస్తుంది. ఒక దేవదూత కూడా ప్రత్యక్షమై తూర్పు దేశపు జ్ఞానులకు 'మీ రాజు పుట్టాడని..... అక్కడకు వెళ్ళమని, మీక్ నక్షత్రం దారిచూపుతుందని' చెబుతాడు. ఆ జ్ఞానులు నక్షత్రం వెంట నడచుకుంటూ ఆ శిశువున్న చోటికి వచ్చి ప్రార్థనలు చేసి కానుకలు సమర్పించుకుంటారు.
అదే సంప్రదాయంగా ఈరోజు క్రైస్తవులు ప్రార్థనలూ, బైబిలు పఠనంతో పరిశుద్ధంగా గడుపుతారు. క్రిస్మస్ చెట్లు పెట్టి క్రొవ్వొత్తులు, చాక్లెట్లు, బెలున్లతో అలంకరించి కేకులు పంచుతూ కోలాహలంగా పండుగ చేసుకుంటారు. బాలయేసు. రాకకోసం ప్రత్యేకప్రార్థనలు చేస్తారు. క్రిస్మస్ ముందురోజు అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. చేస్తారు. మనసుల్లో పేరుకు పోయిన మాలిన్యాన్ని తరిమికొట్టాలని, ప్రతీ హృదయం త్యాగబుద్ధితో మెలగాలని ప్రార్థిస్తారు. బంధుమిత్రులను కలిసి అభినందనలు తెలుపుకుంటారు.
ఈ పండుగ మరో విశేషం క్రిస్మస్ తాత. ఈయన కోసం పిల్లలంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తారు. క్రిస్మస్ తాత పిల్లలకెన్నో బహమతులు, చాక్లెట్లు తెచ్చిస్తాడు. ఈరోజే పోప్ తన అమూల్య సందే శాన్ని వినిపిస్తారు. ఏసుక్రీస్తు ప్రబోధించిన ప్రవచనాలు, శాంతి సందేశం ఎప్పటికీ ఆచరణీయమే. మంచిని పెంచేందుకు ప్రాణాలనే పణంగా పెట్టిన మహోన్నతుడు ఏసు. దారితప్పుతున్న ప్రజలకు ఆయన ఒక గొర్రెల కాపరి, త్యాగానికీ, అనురాగానికి నిలువెత్తు ప్రతీక. అందుకే ఆయన జన్మదినం లోకానికంతటికీ పర్వదినం.

కామెంట్‌లు